అంతర్వేది పుణ్యధామం
గోదావరీ నది పాయలలో ఒకటైన వశిష్ట పాయ సముద్రంలో కలిసే స్థలంలో ఉన్న అంతర్వేది గొప్ప నారసింహ క్షేత్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంది. సముద్రంలో తిరిగే ఓడలు తరచూ అగ్నిప్రమాదాలకు గురి అవుతుండడం వల్ల మొగల్తూరు రాజా వారు ఇక్కడ నారసింహ యంత్ర ప్రతిష్ఠ చేయించి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. శ్రీనాుని రచన ’భీమఖండం’లో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.
క్రీ.శ. 1582 ప్రాంతంలో స్వామి వారి సుదర్శన చక్రం సముద్రు ఉప్పెనలో కొట్టుకొని పోయింది. అప్పుడు పేరూరు నివాసి అయిన అంతర్వేది చయనులనే బ్రాహ్మణుడు 11 రోజులపాటు జపం చెయ్యగా చక్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అప్పటినుండీ స్వామి వారి కళ్యాణ సమయంలో పేరూరు వారిని ఆడపెళ్ళివారిగా పరిగణించడం ఆచారంగా వస్తోంది.
పూర్వం హిరణ్యాక్షుని కుమారుడైన రక్తలోచనుడనే రాక్షసుడితో స్వామి యుద్ధం చేశాడు. రక్తలోచనుని రక్తపు చుక్క భూమిమీద పడితే మరొక రక్తలోచనుడు పుట్టుకు వస్తాడు. అందువల్ల స్వామి సోదరి అశ్వరూఢాంబ (గుర్రాలక్క) వచ్చి తన నాలుకను పెంచి, యుద్ధభూమిపై పరచింది. దాంతో రక్తలోచనుని రక్తం నేలమీద పడలేదు. ఆ తరువాత స్వామి ఆ రాక్షసుణ్ణి వధించడం సులభమైంది. రాక్షసవధ జరిగాక గుర్రాలక్క తన నాలుక పైనున్న రక్తాన్ని ఒక పక్కకు వదిలింది. ఆ రక్తపు కాలువనే నేడు రక్తకుల్య అంటున్నారు. బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేసి నీలకంఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశాడు.

No comments