మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకత
మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం ... మంగళవారం ... శుక్రవారం ... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు.
శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడని అంటారు. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.
సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి.
ఇక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ 'వరలక్ష్మీ వ్రతం' జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఊరు ... ప్రతి వీధి ... ప్రతి ఇల్లు వ్రతాలతో ... పేరంటాళ్ళతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వ్రతం జరుగుతోన్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని అంటారు. ఇక శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత వుంది. ఈ 'శ్రావణ పౌర్ణమి' రోజున 'రక్షాబంధన్' పండుగ జరుపుకుంటారు. జ్ఞాన స్వరూపంగా 'హయగ్రీవ స్వామి' ... పరిపూర్ణ అవతారంగా 'శ్రీ కృష్ణుడు' జన్మించింది ఈ మాసంలోనే. దైవ సంబంధమైన ఇన్ని వేడుకలకు వేదికగా నిలిచిన కారణంగానే శ్రావణమాసాన్ని అంతా ఆహ్వానిస్తారు ... ఆరాధిస్తారు.

No comments