Breaking News

భగవద్గీత - ఏకాదశాధ్యాయ ఫలం

పూర్వం ప్రణీతానది ఒడ్దున మేఘంకరం అనే ఒక పురంలో సర్వలోక జగన్నాథుడైన శ్రీహరి అక్కడె నివసిస్తూ అక్కడి జనులకు సమస్త సౌఖ్యాలనూ ప్రసాదిస్తూ ఉండేవాడు. అక్కడ మేఖాలయమని ఒక ప్రసిద్ధ తీర్థం ఉండేది. ఆ పురంలో సునందునే ఒక సదాచార సంపన్న విప్రుడు ఉండేవాడు. వేద శాస్త్ర ప్రవీణుడైన అతడు ప్రతి నిత్యమూ విష్ణుసన్నిధిలో భగవద్గీత ఏకాదశాధ్యాయం పారాయణ చేయగా చేయగా జీవన్ముక్తుడై జీవనయాత్ర సాగిస్తున్నాడు. ఒకప్పుడు అతడు అనేక తీర్థాలు దర్శిమ్చి, చివరకు వివాహమండపం అనే ఊరికి తన తోటి యాత్రిక స్నేహితులతో పాటు చేరాడు. గ్రామాధికారిని అడిగి ఆయన చూపించిన ఒక ఇంట్లో ఆ రాత్రి మిత్రులతో నిద్రించాడు. మరుసటి రోజు లేచి చూసేసరికి అతడు తప్ప తక్కిన వారమ్తా అదృశ్యులయ్యారు. కొంతసేపటికి గ్రామాధికారి వచ్చి ఒక ఉదంతాన్ని తెలియచేశాడు. "మహానుభావా! ఈ మేఘంకరపురంలో నరభక్షకుడైన ఒక రాక్షసుడున్నాడు. అతడు ఊరిలోని జనులందరినీ మ్రింగుతూ ఉంటే, మేమందరం ఆలోచించి అతనితో ఒక ఒడంబదికకు వచ్చాం. ఇతర గ్రామాలనుండి వచ్చి నిద్రించేవారిని మాత్రంభక్షించవలసిందనీ, లేదంటే ఊరిలో జనులు ఉండరనీ ప్రార్థించాం. అందుకోసం ఒక ధర్మశాలను కూడా ఏర్పాటు చేశాం. నాకుమారుడు కూడా అతనినోట పాలయ్యాడు. మహాత్మా! మీరు తప్ప మీ వెంటనున్న వారందరూ ఆ రాక్షసుని పాలయ్యారు. మీలో ఏదో ఒక అలౌకిక శక్తి ఉన్నందువల్లే మీరు జీవించగలిగారు. మహనీయా! అతడు నాకుమారుని భక్షించినప్పుడు నా కుమారుణ్ణి ఎలా బ్రతికించుకుంటానని దుఃఖంతో అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా చెప్పాడు.
భగవద్గీత ఏకాదశాధ్యాయాన్ని పారాయణ చేస్తూ జలాన్ని అభిమంత్రించినట్లయితే ఆ మంత్రజలాల ప్రభావం వల్ల నా రాక్షస జన్మ విముక్తమవడమే కాక, నానోటపాలైన వారందరూ ముక్తులవుతారని చెప్పాడు. ఇలాంటి అత్యద్భుతశక్తి ఆ అధ్యాయానికి ఎలా కలిగిందని నేను అడిగాను. అందుకా రాక్షసుడు ఈ విధంగా చెప్పాడు.
"విత్తవానుడు అనే ఒక బ్రాహ్మణుడు సదా భగవద్గీత ఏకాదశాధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవాడు. అతడు మరణించిన తరువాత అతని అస్తి ముక్కనొకదానిని ఒక గ్రద్ద నొట కరచుకొని ఎగిరిపోతుండగా త్రోవలో ఒక నీటిమడుగులో పడింది. అందువల్ల ఆ ప్రదేశం మహాతీర్థంగా ప్రసిద్ధిచెందింది.భగవద్గీత ఏకాదశాధ్యాయానికి అంతటి మహిమ ఉంది. కాబట్టి కుమారుణ్ణి పునర్జీవితుణ్ణి చేయడానికి నీవద్దకు వెళ్ళమని చెప్పాడు."
అప్పుడు ’అసలు ఈ రాక్షసునికి ఈ జన్మ ఎందువల్ల సంప్రాప్తమైంద’ని సునందుడు అడిగాడు. అందుకు గ్రామాధికారి ఈవిధంగా చెప్పాడు. "బ్రాహ్మణోత్తమా! పూర్వం ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడతడు తన పొలంలో విశ్రాంతికై కూర్చొని ఉండగా ఒక గ్రద్ద ఒక బాటసారిని పొడిచి పొడిచి చంపుతోంది. ఆ బ్రాహ్మణుడు దాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయకుండా అలాగే ఉండిపోయాడు. అంతలో ఆ దారిన వస్తున్న ఒక మునీశ్వరుడు అది చూసి, పరుగు పరుగున వచ్చాడు. కానీ అప్పటికే గ్రద్ద బాటసారిని చంపి ఎగిరిపోయింది. ప్రక్కనే ఉండికూడా బాటసారిని రక్షించే ప్రయత్నం చెయ్యని బ్రాహ్మణ కృషీవలుని మీద మునీశ్వరునికి కోపం వచ్చింది. బాటసారి అయిన తోటి మనిషిని కాపాడని దోషానికి రాక్షసుడవై జన్మించమంటూ శపించాడు. శాపపరిహారమ్ చెప్పి అనుగ్రహించాల్సిందిగా మునీశ్వరుణ్ణి వేడుకున్నాడు బ్రాహ్మణుడు. భగవద్గీత ఏకాదశాధ్యాయాన్ని ఏడుసార్లు పఠించి, అభిమంత్రించిన జలముతో నీకు శాపవిముక్తి కలుగుతుందని మునీశ్వరుడు చెప్పాడు. కనుక మహాత్మా! మీరు గీత పదకొండో అధ్యాయాన్ని ఏడుసార్లు పఠించి నా కుమారుణ్ణి, రాక్షసుడిగా మారిన బ్రాహ్మణుణ్ణీ ఉద్ధరించండి!"
సునందుడు అలాగే భగవద్గీత పదకొండో అధ్యాయాన్ని ఏడుసార్లు పారాయణ చేసి, మంత్రజలాన్ని రాక్షసుని శిరస్సు మీద జల్లగానే - ఆ రాక్షసుడు, అతని చేతుల్లోప్రాణాలుకోల్పోయిన అభాగ్యులంతా దివ్య దేహాలతో విష్ణులోకానికి చేరుకున్నారు. గ్రామాధికారు కుమారు


No comments