ఋషిపంచమి ఏడుగురు సప్త ఋషులు
కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!
కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు ఋణములలో ఋషి ఋణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ మనకు నేర్పింది వీళ్ళే మరి. దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనే చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు. అదీ కుదరకపోతే అందులో సగం చెయ్యమంటాడు. అలాగే ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమి నాడు స్మరించుకొని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు. ఆ ఐదుగురు ఎవరంటే అత్రి, ఈయన భార్య అనసూయ - వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ఇక రెండవ వారు భరద్వాజుడు, ఆపై గాయత్రీ మంత్ర స్రష్ఠ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని.
నిజానికి ఈ పండుగ స్త్రీలకూ సంబంధి౦చినది. దీనిని భాద్రపద శుద్ధ పంచమి రోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది. ఈవ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసి దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మదేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తుంది.
వ్రత విధానం: ఉత్తరేణి మొక్కను వేళ్ళతో సహా పెరికి దాని కొమ్మతో ఉదయాన్నే పళ్ళు తోముకోవాలి. అనంతరం గంగా జలం, బురద, తులసి చెట్టులోని మట్టి, ఆవుపేడ, రావిచెట్టు మట్టి, గంధపు చెక్క, నువ్వులు, గోమూత్రం వీటినన్నింటినీ కలిపి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై 108 చెంబులతో స్నానం చెయ్యాలి. స్నానం నదిలో కానీ ఇంట్లో గానీ చెయ్యవచ్చు. స్నానం చేస్తున్న సమయంలోనే ఈ క్రింది శ్లోకం 108 సార్లు చదవాలి.
"ఆయుర్బలం యశో వర్చః ప్రజాపశు వశూనిచ!
బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే!!"
ఈ
వ్రతాన్ని ఇలా చేసిన అనంతరమే పూజము ఉపక్రమించాలి. ఏడు కలశములను స్థాపన చేసి అత్రి, కశ్యప, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని మరియు వశిష్ఠ మహర్షులను వారి భార్యలతో సహా ఆవాహనము చేసి అందరికీ షోడశోపచార పూజ చేయాలి. ఏడుగురు వేద పండితులను ఆహ్వానించి వాయనముతో కూడి తాంబూలము సమర్పించవలెను. ఆరోజు రాత్రి సప్తర్షులకు సంబంధించిన కథలను వినాలి. మరునాడు భర్తతో కలిసి హోమము చేసి వ్రతమును పూర్తి చేయవలెను. ఇలా వరుసగా ఏడు సంవత్సరములు ఆచరించిన పిదప ఉద్యాపన చేసుకొనవలెను.

Post Comment
No comments