బ్రాహ్మణుడు భగవద్గీత పదమూడో అధ్యాయాన్ని(క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం) పారాయణ
దక్షిణదేశంలో తుంగభద్రానదీ తీరాన హరిహరపురం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో హరిదీక్షితుడు అనే ధర్మాసక్తుడైన ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు దురాచార. ఆమె ప్రవర్తన కూడా పేరుకు తగినట్లే ఉండేది. నిరంతరం భర్తను దూషించడం, స్వేచ్ఛావిహారిణియై తిరగడం మొదలుపెట్టింది. దుష్ట ప్రవృత్తితో ఒకనాటి రాత్రి నగరానికి దూరంగా ఉన్న ఒక అరణ్య ప్రదేశంలోని ఒక సంకేత స్థలానికి తన ప్రియుణ్ణి రమ్మని కబురుపెట్టింది.
తానుగా ఆ సంకేత స్థలానికి వెళ్ళి ఎంత వేచిచూసినా, ఎవరూ రాలేదు. విసిగిపోయి ఒక రాతి మీద కూర్చొని ఉండగా వెనుకనుండి ఒక పులి వచ్చి మీద పడి ఆమెను చీల్చి చంపింది. మరణించిన తరువాత పాపఫలితంగా అనేక కల్పాల కాలం నరకంలో ఆమె ఘోర యాతనలు అనుభవించింది. అటు తరువాత భూలోకంలో చండాల స్త్రీగా జన్మించింది.
కొంతకాలం తరువాత ఒకనాడు ఆ ఊరిలోని ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వర సతి అయిన జృంభకాదేవి ఆలయం కనిపించగా లోనికి వెళ్ళింది. అక్కడ వాసుదేవుడనే బ్రాహ్మణుడు భగవద్గీత పదమూడో అధ్యాయాన్ని(క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం) పారాయణచేస్తున్నాడు. అప్పుడు ఆమె అక్కడే నిలబడి, దాన్ని శ్రద్ధగా శ్రవణం చేసింది. అతడు త్రయోదశాధ్యాయ పారాయణ సంపూర్ణం చేయగానే ఆమెకు ఆ చండాల రూపము నశించి, దివ్యరూపం ప్రాప్తించి, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది. పదమూడో అధ్యాయ పారాయణం వల్ల సకల పాప విముక్తి, సద్గతి తప్పక కలుగుతుందని తెలుస్తోంది.
తానుగా ఆ సంకేత స్థలానికి వెళ్ళి ఎంత వేచిచూసినా, ఎవరూ రాలేదు. విసిగిపోయి ఒక రాతి మీద కూర్చొని ఉండగా వెనుకనుండి ఒక పులి వచ్చి మీద పడి ఆమెను చీల్చి చంపింది. మరణించిన తరువాత పాపఫలితంగా అనేక కల్పాల కాలం నరకంలో ఆమె ఘోర యాతనలు అనుభవించింది. అటు తరువాత భూలోకంలో చండాల స్త్రీగా జన్మించింది.
కొంతకాలం తరువాత ఒకనాడు ఆ ఊరిలోని ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వర సతి అయిన జృంభకాదేవి ఆలయం కనిపించగా లోనికి వెళ్ళింది. అక్కడ వాసుదేవుడనే బ్రాహ్మణుడు భగవద్గీత పదమూడో అధ్యాయాన్ని(క్షేత్రక్షేత్ర
Post Comment
No comments