మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్
నేటి సమాజంలో తల్లిదండ్రులను ఆప్యాయతో ఆదరించే బిడ్డలు అరుదైపోతున్నారు. వారి యోగక్షేమాలను విచారించేవారే కరువైపోతున్నారు. ప్రేమవచనాలతో వారి మనస్తాపాల్ని చల్లార్చి వారికి ప్రశాంతతను చేకూర్చే సుపుత్రులు కనుమరుగైపోతున్నారు’ - ఇవన్నీ మనం నిత్యం వింటున్న మాటలు. ఇది నేడు చర్చనీయాంశంగా మారింది. సమాజంలో ఈ సమస్య రోజురోజుకు ప్రబలుతుండడానికి కారణాలేమిటి? అందుకు ముఖ్యమైన రెండు కారణాల్ని పరిశీలిద్దాం:
మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్!
మత్వాగృహీ నిషేవేత సదా సర్వ ప్రయత్నతః!! (ఆర్యధర్మ)
నవమాసాలూ మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడే తల్లి ఇలలో మొదటి దైవం. ఇహపరాలు సాధించేందుకు విద్యాబుద్ధులను నేర్పించి, స్వశక్తిపై ఆధారపడేలా తీర్చిదిద్దే తండ్రి రెండో దైవం. ఈ ప్రత్యక్ష దైవాలను సర్వశక్తులా ప్రయత్నించి, సదా సేవించడమే బిడ్డల కర్తవ్యం. ఈ సనాతన ధర్మాన్ని విస్మరించడం సమస్యకు మొదటి కారణం.
యం మాతాపితరౌ క్లేశం సహేతే సంభవే నృణామ్!
స తస్య నిష్కృతిః శక్యా కర్తుం వర్ష శతైరపి!! (మనుస్మృతి)
పిల్లల శ్రేయస్సుకోసం, అభివృద్ధికోసం అష్టకష్టాలనైనా ఆనందంగా అనుభవించే తల్లిదండ్రుల ఋణం వందల సంవత్సరాలు శ్రమించినా తీర్చలేనిది’ అని తల్లిదండ్రుల మహోన్నత త్యాగనిరతిని చాటిచెప్పిన మనుస్మృతిలోని హితవచనాల్ని మన స్మృతిపథం నుంచి పూర్తిగా తుడిచి వేయడం రెండో కారణం.

No comments